కారంపూడిలో పశు వైద్యశాల వద్ద రైతులకు 50% సబ్సిడీపై పశువుల దాణా, 70% సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే కూటమి లక్ష్యమని వారు తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జూలకంటి తెలిపారు.