సీఎం చంద్రబాబు విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్ జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ధ్వంసం చేస్తున్నారని, చంద్రబాబు పాలనతో 10వేల మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు వస్తాయన్నారు. స్కూల్ రీఓర్గనైజేషన్ విషయంలో గందరగోళంగా వ్యవహరిస్తూ, సబ్జెక్ట్ టీచర్లను పక్కన పెడితే విద్యా నాణ్యత దెబ్బతింటుందని తెలిపారు.