నల్లబర్లీ రైతుల నష్టాలపై కౌలురైతుల ఆందోళన

73చూసినవారు
నల్లబర్లీ రైతుల నష్టాలపై కౌలురైతుల ఆందోళన
నల్లబర్లీ పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో మునిగిపోతున్నారని, ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించడంలేదని కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు విమర్శించారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించిన ఆయన, కంపెనీలు హామీలు ఇచ్చి రైతులను నమ్మించి ఇప్పుడు సిండికేట్‌గా ఏర్పడి మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లబర్లీకి కనీస మద్దతు ధర రూ. 15, 000 నుంచి రూ. 18, 000 వరకు నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్