గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న భూ అక్రమాలపై డిసెంబర్ 1 నుంచి గ్రామసభలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ శాఖపై తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి భూ అక్రమాల మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం చెప్పారు. గ్రామసభల ద్వారా 45 రోజులలో సమస్యలు పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు