ప్రతీ ఒక్కరి ఆహారపు అలవాట్లు, జీవన విధానం సక్రమంగా ఉండాలని, అప్పుడే ఎవరి ఆరోగ్యం వారిచేతిలోనే వుంటుందని వెల్నెస్ కోచ్ వై. వేణుగోపాలరావు అన్నారు. భట్టిప్రోలు మండల పరిధిలోని ఐలవరం జడ్పీ పాఠశాలలో గురువారం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు - పరిష్కారం అనే అంశంపై అవగాహన కల్పించారు. మానవ శరీరం కూడా ఒక గడియారంలా ప్రతీ అవయవం నిర్దేశిత సమయంలో పనిచేస్తుంటాయని తెలిపారు.