బొల్లాపల్లి: మిర్చి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

70చూసినవారు
బొల్లాపల్లి మండలంలో నకిలీ మిర్చి విత్తనాలు నాటి 100 ఎకరాలు పంట నష్ట పోయామని కలెక్టర్ కు, ఎస్పీకి రైతులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం వ్యవసాయ శాస్త్రవేత్తలు మండలంలో పర్యటించారు. రైతులను కలిసి నష్ట పోయిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్