బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి గురువారం బొల్లాపల్లి మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు పరిశీలించినట్లు తెలిపారు. కస్తూరిభాగాంధీ పాఠశాలలో కాలం చెల్లిన చిక్కీలు ఉన్నాయని, విద్యార్థులను స్టోర్ రూమ్లో కూర్చోపెడుతున్నారన్నారు. ఈ ఘటనలో సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.