బొల్లాపల్లి మండలంలో బుధవారం విద్యుత్ షాక్ సంభవించి యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గంగుపల్లి తండాలో పోలం పనులకు వెళ్లిన యువకుడుకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలంలోకి పశువులు రాకుండా పోలం చుట్టూ విద్యుత్ ఏర్పాటు చేసుకున్నాడు. గమనించని యువకుడు పోలంలోకి వెళుతూ షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.