నూజెండ్ల మండలంలో పట్టపగలే చోరి

65చూసినవారు
నూజెండ్ల మండలంలోని బీసీ కాలనీలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. బాధితుల వివరాలు ప్రకారం చామర్తి ఏడుకొండలుకు చెందిన ఇంట్లో మధ్యాహ్నం ఎవరూ లేని సమయాన చోరీ జరిగిందని తెలిపారు. ఇంటి తలుపుకున్న తాళం కోసి, బీరువా బద్దలు కొట్టి సుమారు ఏడు సవర్ల బంగారం, 50వేల నగదు చోరీ జరిగిందని బాధితులు వాపోయారు. చోరీపై ఐనవోలు ఎస్ఐ కృష్ణరావుకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్