ఎడ్లపాడు: గుండెపోటుతో సీఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మృతి

51చూసినవారు
ఎడ్లపాడు: గుండెపోటుతో సీఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మృతి
ఎడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన సీఆర్పిఎఫ్ కానిస్టేబుల్ దావల చిన్న మార్తయ్య (40) సోమవారం మృతి చెందారు. ఒడిస్సాలో పనిచేస్తున్న ఆయన ఇటీవల స్వగ్రామం సొలసకి వచ్చాడు. ఉదయం ఇంటి వద్ద కాలకృత్యాలు పూర్తయిన అనంతరం గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్