గుంటూరు-కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజేంద్రప్రసాద్ గారి గెలుపుకు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఆదివారం వినుకొండ టీడీపీ కార్యాలయంలో యన్ డీ ఎ సమావేశం జరిగింది. సమావేశంలో మక్కెన మల్లికార్జునరావు, జనసేన సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.