వినుకొండ మండలం తహశీల్దార్ కార్యాలయంలో ఆగస్టు 15 వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సురేవ్, రెవెన్యూ సిబ్బంది, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.