బొల్లాపల్లిలో వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీలు

77చూసినవారు
బొల్లాపల్లి మండలంలో నకిలీ మిర్చి విత్తనాలు వేసి పంట నష్ట పోయామని రైతులు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న వ్యవసాయ శాఖ ఏడీఏ రవిబాబు, ఏఓ అంకారావులు పంటలను, కల్లాలలో ఉన్న మిర్చి పంటను గురువారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్