నూజెండ్లలో నివాసముంటున్న గంగినేని వెంకటేశ్వర్లు తన తండ్రి కొండయ్యను జనవరి 30న కాలువలోకి నెట్టి హత్య చేశాడు. ఈ ఘటనపై సీఐ ప్రభాకర్ గురువారం ఈపూర్ పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ జనవరి 30న ఈపూరు మండలం బద్రుపాలెం వద్ద సాగర్ కెనాల్లో తండ్రిని కుమారుడు నెట్టి వేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు వెంకటేశ్వర్లును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచామన్నారు. కాగా న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు.