మద్యం విధానంలో భాగంగా ఈపూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గౌడ కింద 01 మద్యం దుకాణానికి అనుమతి లభించిందని ఈపూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ కే శ్రీనివాసులు బుధవారం అన్నారు. మద్యం దుకాణం కోసం అప్లికేషన్లను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాలలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మంజూరైన దుకాణం కోసం నోటిఫికేషన్ విడుదల అయిందని తెలిపారు.