జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 6న వినుకొండలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఆ సంస్థ అధికారి తమ్మాజీరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 5 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఎంపికైన వారికి రూ. 12వేల నుంచి రూ. 25వేల వరకు జీతం ఉంటుందన్నారు. నైపుణ్యం. ఏపీ. గవర్నమెంట్. ఇన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నేరుగా కూడా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని చెప్పారు.