నూజెండ్ల: కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి

58చూసినవారు
నూజెండ్ల: కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి
నూజెండ్ల మండలం లోని దాట్లవారి పాలెంలో వీధి కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందగా మరికొన్ని గాయపడ్డాయి. రైతు మొరబోయిన పెద్ద వీరయ్య కు చెందిన 25 గొర్రెలపై కుక్కలు సోమవారం రాత్రి దాడి చేశాయి. సుమారు రూ. 2. 50 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ఆర్థికంగా నష్టపోయిన తనను ప్రభుత్వమే ఆదుకోవాలని వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్