నూజండ్ల మండలంలో గుళ్లకమ్మ వాగులో పడి మహిళ మృతి చెందింది. మండలంలోని పాత నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మరియమ్మ సోమవారం గేదెలు తోలుకొని గుళ్లకమ్మ వద్దకు వెళ్లింది. గేదెలు గుళ్లకమ్మ దాటి అవతలి వడ్డుకు వెళ్లాయి. వాటి కోసం గుళ్లకమ్మ వాగు లోకి వెళ్లిన మరియమ్మ ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని మంగళవారం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.