వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగుల పెన్షన్లను డాక్టర్ల బృందం వెరిఫికేషన్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. తప్పుడు సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం నుంచి పది రోజుల పాటు పెన్షన్లు పొందుతున్న వారిని విచారించనున్నట్లు తెలిపారు.