పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని శివయ్య స్థూపం కూడలిలో అక్రమణలు పెరిగి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు శనివారం ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ముందుగా ప్రభుత్వ గదులను తొలగించి, అనంతరం అక్రమ నిర్మాణాలను కొంతమేర తీసివేశారు. ఈ చర్యలతో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.