వినుకొండ పట్టణంలోని సైడ్ కాలువల్లో పూడిక తీత పనులు శుక్రవారం ప్రారంభించారు. పట్టణంలోని పలు ప్రధాన రహదారుల వెంట ఉన్న సైడ్ కాల్వల్లో పూడికలు గత వారం రోజులుగా తీయడం జరుగుతోంది. పూడికలు తీయడానికి సుమారు రూ. 45లక్షలను నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికి 7 లక్షలకు టెండర్లు పిలువగా పట్టణంలోని పల్నాడు రోడ్డులో ఇరువైపుల కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు.