నూజండ్ల మండల పరిషత్ కార్యాలయంలో జలశక్తి అభయాన్ కార్యక్రమంపై ఎన్ఆర్ఆజీఎస్ సిబ్బందికి, డ్వాక్రా మహిళలకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి. వీరభద్రాచారి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ వేగవంతం చేసేందుకు ప్రజల భాగస్వామ్యం గురించి అవగాహన కల్పించారు. ఏపీఓ, స్వచ్ఛభారత్ మండల రిసోర్స్ కోఆర్డినేటర్ కంచర్ల సుబ్బరామయ్య, తదితరులు పాల్గొన్నారు.