వినుకొండ పట్టణంలోని తిమ్మాయపాలెం రోడ్డులో ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై నుంచి పడిన ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు క్షతగాత్రుడు మద్యం మత్తులో ఉండడం వలన ద్విచక్ర వాహనంపై నుంచి జారి పడినట్లు చెప్పారు. 108 సహాయంతో క్షతగాత్రడుని వినుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.