డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వైద్యాధికారి రావిపూడి రమ్య అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం శావల్యాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ప్రధాన రహదారి వెంట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి రాకుండా ఆరుబయట నీరు నిలవకుండా చూసుకోవాలని, చెత్తను బయట పారవేయకుండా కుండీలలో వేయాలని సూచించారు.