పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఐనఓలు పోలీస్ స్టేషన్ ను ఎస్పీ కంచి శ్రీనివాసరావు సందర్శించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం రాత్రి ఐనఓలు పోలీస్ స్టేషన్ ను ఎస్పీ తనిఖీ నిర్వహించారు. రూరల్ సీఐ ఉప్పుటూరి సుధాకర్ కు పలు సూచనలు చేశారు. సిబ్బందిని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏస్బీ సీఐ సురేశ్ కుమార్, టౌన్ సీఐ సాంబశివరావులు పాల్గొన్నారు.