వినుకొండ డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిమ్ నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 10వ తేది రాత్రి 8గంటలకు బయలుదేరి 11వ తేది ఉదయం తిరుత్తణి శ్రీకుమారస్వామి, శివకంచి, విష్ణుకంచి దర్శించుకుంటారు. రాత్రి 8గంటలకు అరుణాచలానికి చేరుకుంటారని తెలిపారు. గిరిప్రదక్షిణ, దర్శనం చేసుకొని ఫిబ్రవరి 12న గోల్డెన్ టెంపుల్, కాణిపాకం వినాయకుని దర్శనం చేసుకొని 13న ఉదయం వినుకొండకు చేరుకుంటారన్నారు.