వినుకొండ మార్కాపురం రోడ్డులోని పసుపులేరు బ్రిడ్జి వద్ద ఖాదర్ బాబా ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు జండా వద్ద పూజలు నిర్వహించి, బాబా విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. ఖాదర్ బాబా మహిమలు విశేషమని, భక్తుల మొక్కులు తీర్చుకునే పవిత్ర స్థలమని అన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.