నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడులో చిన్న, సన్నకారు రైతులు గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు మంజూరు చేయాలని శుక్రవారం వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును కలిసి రైతులు వినతి చేశారు. అయితే తహసిల్దార్ కార్యాలయంలో నుంచే భూములను మిలిటరీ వారికి అప్పగించామని చెప్పడం రైతులను కలవరపరిచింది. స్పందించిన ఎమ్మెల్యే తహసిల్దారుకు ఆదేశాలు ఇవ్వగా, మిలిటరీ అధికారులు కూడా ఎమ్మెల్యేని కలిసి వివరణ కోరారు.