పరిశ్రమలు, భూయజమానుల్ని బెదిరించే రోజులు కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లిపోయాయి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కియా పరిశ్రమ లాంటి వాటికి వెళ్లి తమకు లంచాలు ఇవ్వమని అడిగితే వైసీపీ పాలనలో నడుస్తుందేమో గానీ తెదేపా పాలనలో నడవదని సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారన్నారు.