వినుకొండలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఆలయ హుండీ లెక్కించారు. హుండీ ఆదాయము 5 లక్షల 39వేల 430 రూపాయలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి పల్నాడు జిల్లా జి ఏ వి. శ్రీనివాస్, ఇన్ స్పెక్టర్ నరసరావుపేట కార్యనిర్వహణాధికారి కే. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.