యూత్ ఫర్ మై భారత్" శిబిరంలో పాల్గొన్న వివిఐటి విద్యార్థులు

59చూసినవారు
యూత్ ఫర్ మై భారత్" శిబిరంలో పాల్గొన్న వివిఐటి విద్యార్థులు
నేషనల్ స్వయం సేవక్ (ఎన్.ఎస్.ఎస్ ) ఆధ్వర్యంలో అస్సాంలోని అస్సాం అగ్రికల్చరలయూనివర్శిటీ నందు జనవరి 21 నుండి 27 వరకూ నిర్వహించిన జాతి సమగ్రతా శిబిరం " యూత్ ఫర్ మై భారత్ " నకు వివిఐటి కళాశాలకు చెందిన బి.వి. అజయ్ కుమార్, సీహెచ్ జీవన ఇద్దరు విద్యార్థులు హజరయ్యారని వివిఐటి కళాశాల ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. యువతను శక్తివంతం చేయడానికి మరియు దేశ నిర్మాణ కార్యకలాపాలలో నిమగ్నం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారభించిన మేరా యువ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ శిబిరానికి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలనుండి 200 మంది ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులను ఎంపిక కాగా, కేవలం వివిఐటి కళాశాల నుండి ఈసి ఈ విభాగానికి చెందిన బి.వి. అజయ్ కుమార్. సి. ఎస్. ఈ విభాగానికి చెందిన సిహెచ్, జీవన ఎంపిక కావడం విశేషం అని వివరించారు. కళాశాల ఎన్.ఎస్. ఎస్ బృందం ద్వారా గ్రామాలలో ప్రత్యేక శిబిరాలు, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటరు అవగాహనా సదస్సులు. పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్న తీరును పరిగణలోనికి తీసుకుని ఈ విద్యార్థులు ఎంపిక చేయబడ్డారని తెలిపారు. శిబిరంలో విద్యార్థులు సమైక్యతా , నాయకత్వ లక్షణాలు, దేశభక్తి అంశాలపై చర్చలు, సామూహిక కార్యక్రమాలలో పాల్గొన్నారని తెలిపారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలనుండి పాల్గొన్న 10 మంది విద్యార్థులతో కలిసి తెలుగు సంస్కృతిని ప్రతిభింబించేలా కొలాటం, కూచిపూడి నృత్యం, రంగవల్లులను ఈ శిబిరంలో ప్రదర్శించారని తెలిపారు. అనంతరం అజయ్ కుమార్. జీవనలను చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, ప్రిన్సిపల్ డా.వై. మల్లికార్జున రెడ్డి అకడమిక్ డీన్ డా.కె.గిరిబాబు, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.ఐ.ఎల్.కె భక్తసింగ్ అభినందించారు.

సంబంధిత పోస్ట్