కొరిశపాడు మండలంలో 94 శాతం పెన్షన్ పంపిణీ పూర్తి

71చూసినవారు
కొరిశపాడు మండలంలో 94 శాతం పెన్షన్ పంపిణీ పూర్తి
కోరిశపాడు మండల వ్యాప్తంగా మంగళవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ కార్యక్రమం అమలు జరుగుతుంది. మండల పరిధిలో 7347 పెన్షన్ లబ్ధిదారులు ఉండగా మంగళవారం మధ్యాహ్నం సమయానికి 6,850 మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని మండల ఎంపీడీవో సురేష్ బాబు తెలిపారు. రాష్ట్రస్థాయిలో కొరిశపాడు మండలం 94 శాతం పెన్షన్ పంపిణీ మధ్యాహ్నం సమయానికి పూర్తి చేసిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్