అద్దంకి: పింఛన్ డబ్బులు కోసం కుమారుడు దాడి చేశాడని ఆవేదన

709చూసినవారు
అద్దంకి పట్టణానికి చెందిన కొమ్మాలపాటి కమలనాథ్ తన కుమారుడు పెన్షన్ డబ్బులు కోసం తనపై కత్తెరతో దాడి చేశాడని ఆదివారం మీడియా ఎదుట వాపోయాడు. శుక్రవారం ఈ సంఘటన జరిగిందని ఆయన పేర్కొన్నారు. గతంలో అనేక పర్యాయాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఉన్న ఆస్తిని కొడుకుకే ఇచ్చానని ఇల్లు రెండు సెట్లు భూమి తప్ప నాకు ఏమీ లేదని కమలానాదం వాపోయారు.

సంబంధిత పోస్ట్