అద్దంకి పట్టణంలోని వైయస్సార్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ సమన్వయకర్త హనిమిరెడ్డిని బీసీ సెల్ అధ్యక్షులు గోలి రమణబాబు మంగళవారం కలిశారు. తనపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చినందుకు నిర్విరామంగా కృషి చేస్తానని రమణ బాబు తెలియచేశారు. నియోజకవర్గంలో బీసీల సమస్యలపై పోరాడి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని హనిమిరెడ్డి సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు.