అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు గురువారం అగ్నిమాపక వారోత్సవ కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులకు ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు ఆధ్వర్యంలో అగ్నిప్రమాదంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ లీకై ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనేదానిపై వివరించారు. ముందుగా తడి బట్టను సిలిండర్ పై కప్పి గాలి ఆడకుండా చూడాలని అన్నారు.