అద్దంకి: జర్నలిస్టులపై అక్రమ కేసులు తగవు

61చూసినవారు
విలేకర్లపై అక్రమ కేసులు అరికట్టాలంటూ జిల్లా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో శనివారం అద్దంకిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక సర్కిల్ పోలీస్ స్టేషన్ వద్ద సిఐ సుబ్బరాజు కు వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఓ మీడియా సంస్థకు చెందిన విలేకరులపై కేసులు బనాయించడం తగదని వారు తెలిపారు. యూనియన్ అధ్యక్షులు రాంబాబు, సోమయ్య, శివ, శీను, కొండలరావు, సర్దార్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్