అద్దంకి మండలంలో ఆయా గ్రామ సచివాలయాల వద్ద తల్లికి వందనం కార్యక్రమానికి అర్హులు, అనర్హుల జాబితాను గ్రామ సచివాలయాలు వద్ద ఉంచినట్టు ఎంపీడీవో సింగయ్య శుక్రవారం తెలిపారు. మండలంలో 5539 మంది అర్హులు గాను, 492 మంది అనర్హులుగాను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. వీటిని మరోసారి పరిశీలించి నెలాఖరులోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.