అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

1చూసినవారు
అద్దంకి మండలం శాంతినగర్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనకనుంచి వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకొని గాయపడిన వ్యక్తిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్