అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

65చూసినవారు
అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
అద్దంకి మండలం తిమ్మాయపాలెం ఇటుక బట్టీల వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై అద్దంకి వైపు వెళుతున్న వ్యక్తి అదుపుతప్పి వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అతనికి ప్రధమ చికిత్స అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు తూర్పు కొప్పెరపాడు గ్రామానికి చెందిన బ్రహ్మయ్యగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్