అద్దంకి టిడిపి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం గోవాడ లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. గ్రామంలో బీటీ రోడ్లు ను ఆయన ప్రారంభోత్సవం చేశారు. పలు అభివృద్ధి శంకుస్థాపన చేశారు. వైయస్సార్ పార్టీ హయాంలో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి రవికుమార్ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరిగెడుతుందని చెప్పారు.