అద్దంకి: అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి

69చూసినవారు
అద్దంకి పట్టణంలోని కాకాని పాలెం నందు సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశానికి దిక్సూచి అయిందని అన్నారు.

సంబంధిత పోస్ట్