అద్దంకి నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఖాది, గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ చౌదరి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి వారు స్థిరపడే విధంగా ఆదుకుంటామని తెలిపారు. మహిళలకు ఉపాధి చూపించడమే తమ లక్ష్యమని రవికుమార్ పేర్కొన్నారు.