అద్దంకి పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వలన ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఆదానితో ఒప్పందాలను రద్దు చేసుకోవాలని అన్నారు.