అద్దంకి: పూల సాగుపై రైతులకు అవగాహన

64చూసినవారు
అద్దంకి: పూల సాగుపై రైతులకు అవగాహన
అద్దంకి మండలం గోపాలపురం గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు పూల సాగుపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ ఏఈఓ దీప్తి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం బంతి, చామంతి, సంపంగి వంటి పూల మొక్కలకు ప్రోత్సాహాలు అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఎకరాకు 6, 400 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. రాయితీపై సేద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్