అద్దంకి మండలంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని గ్రామాలలో ఈనెల 29వ తేదీ నుండి సన్న, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై సర్వే నిర్వహించడం జరుగుతుందని ఎండిఓ సింగయ్య బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సర్వేను సచివాలయ ఉద్యోగస్తులు చేపడతారని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల స్థితిగతులను తెలుసుకోవటానికి ప్రభుత్వం ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పరిశ్రమల యజమానులు సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు.