బల్లికురవ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న మంత్రి

65చూసినవారు
బల్లికురవ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న మంత్రి
బల్లికురవ లోని మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఆయా సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వాటిని ఆయా శాఖల అధికారులకు పంపి వెంటనే వెంటనే వాటిని పరిష్కరించాలని మంత్రి రవికుమార్ ఆదేశించారు. అర్జీలను అలసత్వం చేయవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్