బల్లికురవ మండలం సోమవరప్పాడు గ్రామంలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటాద్రి వరిగడ్డి వాము ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఆహుతి అయ్యింది. ట్రాక్టర్ ట్రక్కు పై వరిగడ్డి వాము ఉండటంతో పైన ఉన్న కరెంటు తీగలు తగిలి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే నష్టం వాటిల్లింది. 40000 వరకు నష్టపోయినట్లు బాధితుడు వెంకటాద్రి తెలిపారు.