బార్లపాలెం: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

60చూసినవారు
బార్లపాలెం: గుర్తుతెలియని మృతదేహం లభ్యం
అద్దంకి మండలం బార్లపాలెం శివారులో చెట్టుకు వేలాడుతూ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 55 సంవత్సరాలు ఉండవచ్చని పది రోజుల క్రితం మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్