కొరిశపాడు మండలం మెదరమెట్ల లోని తమ్మవరం రోడ్డులో ఉన్న అన్ను నవీన్ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు గేటు దూకి దోపిడీయత్నానికి పాల్పడిన సంఘటన సి సి ఫుటేజ్ వీడియో బుధవారం ఉదయం వెలుగు చూసింది. ఇద్దరు దొంగలు దోపిడీకి ప్రయత్నం చేస్తుండగా అలికిడి అవ్వడంతో ఇంట్లో ఉన్నవారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దొంగలు అక్కడ నుంచి జారుకున్నారు.