చెకుముకిలో జిల్లా స్థాయికి ఎంపిక

77చూసినవారు
చెకుముకిలో జిల్లా స్థాయికి ఎంపిక
కొరిశపాడు మండలం మేదరమెట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మంగళవారం మండల స్థాయిలో చెకుముకి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో రాధాస్ గీతం హైస్కూల్ కు చెందిన విద్యార్థులు సింధు రెడ్డి, మనో ప్రసన్న, అంజలి లు మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్ రాధాకృష్ణకుమారి అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్